![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -104 లో....కేశవ ఇంట్లో తన మెకానిక్ వర్క్ కి సంబంధించిన వస్తువులు కన్పించడం లేదని వెతుకుతాడు. అప్పుడే చక్రి ఎంట్రీ ఇచ్చి.. నా భార్య మణి ఎక్కడ అని అంటాడు. దాంతో కేశవ, మాధవ షాక్ అవుతారు. అప్పుడే కన్నా, మహా వస్తారు. మహా ఇండక్షన్ స్టవ్ తీసుకొని వస్తుంది. నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావ్ అమ్మ అని మాధవ అంటాడు. అదేం లేదు పెద్ది.. తీసుకొని వస్తే ఏమైంది ఇప్పుడు దీనిపై మష్రూమ్ కర్రీ చెయ్యాలని అనగానే చక్రి, కేశవ భయపడుతారు. మీరేం బయపడకండి అని మనం చెప్తుంటే పెద్ది చేస్తాడని మహా అంటుంది.
ఆ తర్వాత అందరు కలిసి వంట చేస్తారు. కలిసి కూర్చొని భోజనం చేస్తారు. ఈ ఇంటిని రిపేర్ చెయ్యొచ్చు కదా పెద్ది అని మహా అంటుంది. ఈ ఇల్లుపై కోర్ట్ లో స్టే ఉంది. మా అత్త పెదనాన్న తన వాటా అమ్ముకొని.. ఇప్పుడు మా ఇంట్లో వాటా వస్తుందని కేసు వేశారని మాధవ అంటాడు. ఇంటి పేపర్స్ తో త్వరగా ఆ చికాకు తొలగించి రిపేర్ చేయించుకొండి అని మహా అంటుంది. అప్పుడే నారాయణ ఇంట్లోకి వస్తాడు. నాన్న ఇంటి పేపర్స్ ఉన్నాయా అని అడుగుతాడు. నాకు తెలియదని చెప్పి అతను వెళ్ళిపోతాడు. దాంతో సూట్ కేసు లు తీసుకొని వచ్చి అందులో వెతుకుతారు. అందులో మాధవ, కేశవ, చక్రి వాళ్ళ అమ్మతో దిగిన ఫోటో ఉంటుంది. ఏంటి నేను లేను అని కన్నా అడుగుతాడు. అప్పుడు నువ్వు పుట్టలేదని మాధవ అంటాడు. ఇవన్నీ ఎందుకు క్లోజ్ చేయండి అని మాధవ అంటాడు. ఆగు అన్నయ్య నా ఫోటో చూడు ఎంత క్యూట్ గా ఉన్నానో.. నన్ను ఎవరో ఎత్తుకున్నారు ఏంటి అని కన్నా అంటాడు. ఎవరో నార్త్ ఇండియన్ లాగా ఉంది అని మహా అనగానే నారాయణ ఎవరో నార్త్ ఇండియన్ ఆవిడని తీసుకొని వచ్చాడని ఎవరో చెప్పిన మాటలు గుర్తుచేసుకొని .. ఎవరు ఈవిడ? పెళ్లిచేసుకున్నావా.. ఉంచుకున్నావా అని నారాయణ కాలర్ పట్టుకొని కన్నా అడుగుతాడు. ఈవిడ నన్ను ఎత్తుకోవడం నాకు నచ్చలేదని కన్నా అంటాడు. ఆవిడ మీ అమ్మ అని నారాయణ అనగానే అందరు షాక్ అవుతారు. నాన్న నువ్వు సైలెంట్ గా ఉండు అని చక్రి అంటాడు.. అంటే మీ అమ్మ వేరు.. మా అమ్మ వేరా అని కన్నా షాక్ అవుతాడు.
అదేం లేదురా అని మాధవ అంటాడు. లేదు అన్నయ్య మీరు అప్పటినుండి టెన్షన్ పడుతున్నారు.. ఇందుకేనా అని కన్నా ఏడుస్తాడు. నిన్ను ఎప్పుడు వేరొక తల్లికి పుట్టినవాడిగా చూడలేదు.. నువ్వంటే నాకు ప్రాణం అని మాధవ అంటాడు. ఆ పసిమనసుకి ఎందుకు అంత చేదు నిజం చెప్పావని నారాయణని చక్రి తిడుతాడు. కన్నా ఏడుస్తుంటే మాధవ ఓదారుస్తాడు. తరువాయి భాగంలో కన్నా ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. తన గురించి అందరు వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |